చంద్ర‌బాబు త‌ప్పుల మీద త‌ప్పులు.. మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు..!

Tuesday, April 23rd, 2019, 07:18:51 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రావాల్సి ఉండ‌గా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ సమీక్షలు నిర్వహింస్తుండ‌డంతో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల పాలవుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తనే ముఖ్యమంత్రిని అని చెప్పుకొంటూ చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన విధానం కాదని స‌ర్వ‌త్రా ఆరోపిస్తున్నారు.

రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న‌ప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు కేవలం అపద్ధర్మంగా వ్యవహరించాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ పూర్తి అయినా.. ఫలితాలు వచ్చే వరకూ కూడా కోడ్ అమల్లోనే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ మొత్తం వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుందని అంద‌రికీ తెలిసిందే.

రాష్ట్రానికి ఎన్నికల కమిషనరే సుప్రీం అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం పాలన జరగాల్సి ఉంటుంది. ఇదేమీ కొత్తగా జరుగుతున్నది కాదు. మొదటి నుంచి అమల్లో ఉన్న నియమమే… దేశంలోని పాలకులు అంతా ఈసీని అలా గౌరవిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం తన అధికార దాహంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ చంద్రబాబు తనకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఇప్పుడు చంద్రబాబు సమీక్షలు నిర్వహించకూడదని నియమాలు చెబుతున్నా, బాబు తనే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉన్న వేళ తను హోదాకు మాత్రమే సీఎం అనే విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్రమైన అసహనంతో ఉన్నారు.. అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు.. అధికార దాహంతో వ్యవస్థను కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు.. మ‌రి తెలిసి కూడా త‌ప్పులు చేయ‌డం చంద్రబాబుకే చెల్లింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.