టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా వెనుక బాబు సరైన వ్యూహం..?

Friday, March 15th, 2019, 02:12:48 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మొదలయింది.వచ్చే నెల 11 న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల సమయం రానే వచ్చింది.ఈ సారి పోటీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతుందని మారుతున్న పరిణామాలు చూస్తుంటేనే అర్ధమవుతుంది..ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి పార్టీ అయిన జనసేన కూడా తొలి విడత తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు.ఇక ఆ తర్వాత ఎలాగో అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్ననే 126 మంది అభ్యర్థుల పేర్లతో టీడీపీ మొదటి జాబితాను విడుదల చేసారు.

అయితే ముందు టీడీపీ శ్రేణులు చెప్పిన సమాచారం ప్రకారం కేవలం 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని అన్నారు,కానీ ఇప్పుడు అటు ఇటు కాకుండా 126 మంది ఉన్న జాబితాను విడుదల చేసి ఇంకా 49 మంది అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు.ఇలా పెండింగ్ ఉంచడం వెనుక బాబు సరైన వ్యూహమే ఉందని రాజకీయ శ్రేణులు చెప్తున్నారు.ఎందుకంటే చంద్రబాబు పెండింగ్ ఉంచిన స్థానాలన్నిటిలోను వారి ప్రత్యర్థి పార్టీ వైసీపీ చాలా బలంగా ఉందని చంద్రబాబుకి తెలిసిందట,అందుకే ఈ 49 స్థానాల్లోనూ ప్రస్తుతానికి పెండింగ్ ఉంచి వారికి ధీటుగా బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాలు వేస్తున్నారని సమాచారం.అందుకు తగ్గట్టు గానే చంద్రబాబు మరో సరి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.మరి చంద్రబాబు ఎలాంటి అభ్యర్థులను నిలబెడతారో చూడాలి.