బాబుకు మాయ ప్రత్యేక ఆశీర్వచనాలు

Saturday, October 27th, 2018, 11:00:06 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ పర్యటన లో భాగంగా ఇప్పటికే పలువురు రాజాకీయ ప్రముఖులతో బాబు భేటీ అయ్యారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ని కూడా బాబు కలిశారు, ఈ భేటీ లో ప్రస్తుతం దేశం లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై సుదీర్ఘంగా చర్చినట్లు తెలుస్తుంది. అయితే మాయ చంద్రబాబు ను ప్రత్యేకంగా ఆశీర్వదించటం విశేషం, భేటీ అనంతరం కారు దాకా వచ్చి మరి బాబు ను సాగనంపారు మాయ.

భవిష్యత్తు లో కలిసి పని చేద్దాం ఆమె చెప్పినట్లు తెలుస్తోంది, ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, అప్పుడే కేంద్రం నియంతృత్వ పోకడలకు చెక్ చెప్పే ఛాన్స్ ఉందని ఆమె పేర్కొన్నారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు అవటం అత్యంత అవసరం అని, ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో ఏర్పడ్డ విభేదాల గురించి కూడా మాయ బాబు తో చర్చించారని సమాచారం. జగన్ పై దాడి జరిగిన తరుణం లో బాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.