సచిన్ తో చంద్రబాబు ముచ్చట్లు..

Friday, April 13th, 2018, 02:09:34 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఏ లెవెల్లో చేస్తున్నారో అందరికి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అగ్ర కంపెనీలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కొన్ని ఫెమస్ కంపెనీలు అమరావతిలో రూపుదిద్దుకొంటున్నాయి. మరికొన్ని ముఖ్యమైన పనుల కోసం చంద్రబాబు రీసెంట్ గా మలేషియా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ చంద్రబాబు తన ఫెవెరెట్ క్రికెటర్ ను కలిశారు.

ప్రస్తుతం మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ కూడా సింగపూర్ లోనే ఉన్నారు. అయితే పనిలో పనిగా అక్కడే ఉన్న చంద్రబాబు మాస్టర్ బ్లాస్ట్ ని కలిశారు. ఇంతకుముందు కూడా సీఎం సచిన్ ను కలిశారు. సచిన్ నెల్లూరు జిల్లాలోని ఆర్థికంగా వెనుకబడిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ విషయం గురించి కూడా సచిన్ చంద్రబాబుతో ముచ్చటించారు. ప్రస్తుతం వారిద్దరికీ సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.