ఆ విషయంలో ఇద్దరు సీఎంలు గ్రేట్

Thursday, October 19th, 2017, 08:36:19 AM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కసారిగా తెలుగు రాజకీయాల్లో ఎవరు ఊహించని మార్పులు వచ్చాయని అందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆరెస్ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంది. ఏ ఎలక్షన్స్ లో అయినా ప్రతి పక్ష పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు.. చేసిన ప్రతి ఒక్క పని ప్రజల్లోకి వెళ్లేలా చూసుకుంటుంది.. అక్కడక్కడ కొన్ని సమస్యలున్నా దాని వెనక అసలు సమస్యలున్నాయని, అదంతా ఇతర పాలకులు చేసిన తప్పులని అందుకే ఆలస్యం అవుతుందని ప్రజలకు తెలిసేలా చేస్తోంది.. అంతే కాకుండా టీఆరెస్ పార్టీలో ప్రతి పక్షాలకు సమాధానం చెప్పే నాయకులు ఉండడం మరో బలం అని చెప్పాలి.. అయితే ఇక్కడ టిడిపి మళ్లీ నిలదొక్కుకోవడం చాలా కష్టమేనని తెలుస్తోంది. ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ లో నేతలు ఉన్న అధికార పార్టీని సమర్థవంతంగా ఎదురుకోలేకపోతున్నారు. కేసీఆర్ తన పాలనతో రాజకీయ ఆలోచనతో ప్రతి పక్షాలను గట్టిగా ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి రాజకీయాలలో పాలన కన్నా అధికార పక్షానికి – ప్రతి పక్షానికి మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిత్యం వర్తోల్లో నిలుస్తున్నాయి.. జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ గెలుస్తున్నా జగన్ ఏ మాత్రం అలసిపోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్సార్ పార్టీ అక్కడ తెలుగు దేశం పార్టీకీ గట్టి పోటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇక జగన్ ఇంకా తన తండ్రి పాలన యొక్క పథకాలను, పనులను ప్రజలకి గుర్తు చెయ్యాలని చూస్తున్నాడు. అంతే కాకుండా పాదయాత్ర కూడా చేసి తండ్రి నడిచిన బాటలోనే నడవాలని చూస్తున్నాడు. అలాగే ప్రభుత్వ లోపాలను ప్రజలు గుర్తించాలని కృషి చేస్తున్నారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు విమర్శలు ఎన్ని వస్తున్నా అన్ని తనే ముందుండి ఎదుర్కొంటున్నారు. నాయకులను కూడా బలోపేతం చేస్తున్నారు. ఇక తెలంగాణ లో టీడీపీ నేతలు దాదాపు ఖాళీ అయినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఏపీ టీడీపీ నాయకులపై రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెంట కరికొంత మంది టీడీపీ అనుచరులు కూడా కాంగ్రెస్ లోకి వెళతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణాలో ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తన పాలనతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలుస్తారో లేదో చూడాలి.