ఆ ఒకే ఒక్కడు చంద్రబాబేనట !

Wednesday, October 24th, 2018, 12:21:12 PM IST

ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని, ఆయన స్థానంలో బాలక్రిష్ణ దిగుతారని ముమ్మరంగా వార్తలు వినిపించాయి. కానీ తాజా పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ప్రచార బరిలోకి దిగుతారని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అందుకు ముఖ్య కారణం కేసీఆర్ అని కూడ అంటున్నారు.

టిఆర్ఎస్ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన దగ్గరనుండి ఆ పార్టీ అధినేత కేసిఆర్ చంద్రబాబుపై ఏకధాటిగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయన్ను తిట్టడానికే సభ పెట్టారా అన్నట్టు ఉండేవి కేసిఆర్ మాటలు. కేసిఆర్ చేసిన విమర్శలకు టీడీపీ నుండి రాబోయే కౌంటర్ బలంగా ఉండాలని, అది ఒకే ఒక్కడు చంద్రబాబు వలనే సాధ్యమవుతుందని, ఆయనే స్వయంగా ఎదురుదాడికి దిగితే ఒక విలువ ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట.

అందుకే చంద్రబాబు ప్రచారంలోకి దిగుతారట. అయితే ఈ ప్రచారం పూర్తిస్థాయిలో రాష్ట్రమంతా ఉండబోదట. కేవలం హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే ఆయన ప్రచారం చేస్తారని, ఇది మహాకూటమికి మంచి లాభాన్ని చేకూరుస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments