లోక్ సభ సమీక్షలో సరికొత్త విధానంతో దూసుకుపోతున్న చంద్రబాబు

Thursday, June 6th, 2013, 09:03:27 AM IST


ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతి పార్టీ సరికొత్త రీతిలో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓ సరికొత్త విధానంతో నేతల ముందుకు వచ్చాడు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల కంటే ముందే ఈ సంవత్సరంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల్ని సాధిస్తే వచ్చే ఎన్నికల్లో ఇంకా సునాయాసంగా గెలుపొందవచ్చని ఆలోచించిన చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. రోజుకు పది పది పన్నెండు నియోజక వర్గాల నేతలతో చర్చిస్తున్నారు. నిన్న తెలంగాణా లోని 12 నియోజక వర్గాల నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతల్లో నూతన ఉత్తేజం నింపడం కోసం చంద్రబాబు తన నియోజక వర్గమైన కుప్పంలో మంచి ఫలితాలు ఉండడంతో వాటన్నిటి మీద ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా చూపించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

చివరిగా ఆయన మాట్లాడుతూ ‘ 2013లో వచ్చే ఎన్నికలకు ఈ స్థానిక ఎన్నికలే పునాది, కావున వీటిలో విజయం సాధిస్తే రానున్న ఎన్నికల్లో కూడా విజయం మనదే అవుతుంది. ఇవి మన ఎన్నికలు కాదని మనకేం సంబంధం లేదని నిర్లక్ష్యం వహించవద్దు, కింది స్థాయి నాయకుకకు మీరు సాయపడితే వారు మీ కోసం పనిచేస్తారని’ ఆయన అన్నారు.