సునామీని సునామీ ఢీకొట్టిన‌ట్టు.. `హోదా`ని `ప్యాకేజీ` ఢీకొడుతుంది!

Tuesday, January 24th, 2017, 07:45:02 PM IST

chandra-babu
ఏపీ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం సెగ కేంద్రాన్ని తాక‌నుందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఓవైపు విశాఖ బీచ్‌లో జ‌న‌సేనాని సేనల‌తో క‌లిసి ప్ర‌జ‌లు ఉద్య‌మానికి రెడీ అవుతున్నారు. ఈ స‌న్నివేశంలో ఆ ప్ర‌భావాన్ని త‌గ్గించాలంటే ఏం చేయాలి?

సీఎం చంద్ర‌బాబు వెంట‌నే వెళ్లి ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని క‌ల‌వాలి. ఓ ఐడియా అడ‌గాలి. నిన్న‌నే `శ్రీ‌వ‌ల్లీ` ఆడియోలో చెప్పిన‌ట్టు .. సునామీని ఎదుర్కోవాలంటే మ‌రో సునామీ సృష్టించాలి… అన్న క‌థ చెప్పిన చందంగా .. ప్ర‌త్యేక హోదా సెగ‌ను అడ్డుకోవాలంటే `ప్యాకేజీ చ‌ట్ట‌బ‌ద్ధ‌త` అన్న అంశాన్ని బ‌లంగా తెర‌పైకి తేవాలి.. అని విజ‌యేంద్రుడు చెబుతారేమో!

ప్చ్! చంద్ర‌బాబు జిత్తుల‌మారి. ఇలాంటి ఐడియాల్ని ర‌చ‌యిత‌లే ఇవ్వ‌న‌క్క‌ర్లేదు కాబ‌ట్టి ఆయ‌న అడ్వాన్స్‌డ్ ప్లానింగులోనే ఉన్నారు. ఓవైపు ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదాపై ఉద్య‌మానికి రెడీ అవుతుంటే దీన్ని ఎన్‌క్యాష్ చేసుకునేందుకు ముందే దిల్లీ వెళ్లి కేంద్రంను క‌లిసేందుకు ప్లాన్ వేస్తున్నారు చంద్ర‌బాబు. హోదా మాట మ‌రుగున ప‌డాలి అంటే వెంట‌నే ప్ర‌క‌టించిన ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ పార్ల‌మెంటు స‌మావేశాల్లో బిల్లు పాస్ చేయాల‌ని అడిగేందుకు వెళుతున్నారుట‌. ఈ మాట‌ను తేదేపా మంత్రి వ‌ర్గ‌మే ముచ్చ‌టిస్తోంది. ఈ విష‌యంపై ప్ర‌ధాని, ఆర్థిక మంత్రుల్ని క‌లిసి బాబు విశ‌ద‌ప‌రుస్తారుట‌. మ‌రి కేంద్రం బాబు మాట విని బిల్లు పాస్ చేస్తుందా? జ‌స్ట్ వెయిట్‌.