తోక క‌ట్ చేస్తా.. ప‌రిమ‌శ్ర‌లు తెస్తా.. సీఎం అల్టిమేటం!

Friday, September 16th, 2016, 12:40:25 PM IST

babu
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. ఏపీకి ప‌రిశ్ర‌లు వ‌స్తుంటే ప్ర‌తిప‌క్షాలు వాటిని అడ్డుకుంటున్నాయ‌ని ఆరోపించారు. కాకినాడ‌లో 500 కోట్ల పెట్టుబ‌డితో దివీస్ కంపెనీ నెల‌కొల్పాల‌ని ముందుకొస్తే ప్ర‌తి ప‌క్ష పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను పంపి అడ్డుకుంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లే రాష్ట్రంలో ప‌రిస్థితులు బాగా లేదు. అలాంటి స‌మ‌యంలో ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయం చేస్తున్నాయి. దేనికైనా ఓ స‌హ‌నం ఉంటుంది. అది త‌ప్పిందంటే అంద‌రి తోక‌లు క‌ట్ చేస్తాన‌ని చంద్ర‌బాబు ఫైర‌య్యారు.. ఎవ‌రు అడ్డుప‌డినా రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు ర‌ప్పిస్తాన‌ని అల్టిమేటం జారీ చేశారు.

రాష్ట్రంలో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉండ‌టం కోసం నేను ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ను. విప‌క్షంలో ఉన్న మంచి వ్య‌క్తులు పార్టీలోకి వ‌స్తానంటే ఆహ్వానించ‌డానికి కూడా సిద్దంగా ఉన్నాం. మీ అంద‌రి స‌హ‌కారం ఉంటే ప‌దేళ్ల‌లో పూర్తి చేయాల్సిన ప‌నుల‌ను నాలుగేళ్ల‌లోనే పూర్తి చేస్తాన‌ని అన్నారు. అలా కాద‌ని రూట్ మారిస్తే …నేను పంథా మార్చాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు స‌మాన‌మైన ప్యాకేజీ ఇస్తుంది. అందుకే వాళ్ల నిర్ణ‌యాల‌ను స్వాగ‌తించాన‌ని తెలిపారు.