చినబాబు.. ఈ ఛాన్స్ వాడుకో !

Saturday, October 13th, 2018, 01:00:51 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉండేది. అరకొర జ్ఞానంతో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేకసార్లు పార్టీని అబాసుపాలు చేశాయి. ఇప్పటి వరకు ఆయన ఏ ఇష్యూ మీద కూడ ప్రజలకి గుర్తుండిపోయేలా మాట్లాడలేదు. అయినా చంద్రబాబు చినబాబుకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.

ఇప్పుడు కూడ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న ఐటీ దాడులపై స్పందించే అవకాశాన్ని లోకేష్ కు ఇచ్చినట్టున్నారు బాబు. పొద్దున్నుండి మంత్రి సిఎం రమేష్ మీద జరుగుతున్న రైడ్స్ పై బాబు మాట కూడ మాట్లాడలేదు కానీ లోకేష్ మాత్రం ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. ఆపేరేషన్ గరుడలో భాగంగానే మోడీ ఏపీ మంత్రులపై దాడులు చేస్తున్నారని మొదలుపెట్టిన లోకేష్ కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చుకుంటాం అంటూ తొడగొట్టినంత పనిచేశాడు.

కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష చేసినందుకే రమేష్ పై ఈ దాడులన్న లోకేష్ కేంద్ర ఇచ్చిన 18 హామీల్ని నెరవేర్చాలని, లేకుంటే పోరాటం ఆగదని, నిలదీసిన గొంతులను నొక్కేసే ఈ నియంతృత్వ పాలనకు త్వరలోనే తెలుగు ప్రజలు మాట్లాడతారని గట్టిగానే వ్యాఖ్యలు చేసి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సాయశక్తులా ట్రై చేస్తున్నారు.