చంద్రబాబు అంత మోసగాడు ఇంకెవరు లేరు..! వై ఎస్ జగన్.

Thursday, September 13th, 2018, 11:00:46 AM IST

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ పాదయాత్ర లోని భాగం గా అక్కడి ముస్లిం సోదరులతో ఒక ముస్లిం ఆత్మీయ సభ ఏర్పాటు చేసారు. ఐతే నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఇంకెవరు లేరు అన్నారు.
దాదాపు నాలుగున్నర ఏళ్ళు కావస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులకు ఏం చేశారో చెప్పాలన్నారు.

ఎన్నికలకు ముందు ముస్లింలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి తర్వాత అధికారం లోకి వచ్చి తర్వాత వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నారు.దేశంలోని చంద్రబాబు నాయుడు యొక్క కేబినెట్ లో మాత్రమే ఒక్క ముస్లిం సోదరు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అని తెలియజేసారు. వైసీపీ అధికారం లోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తాం అని వాగ్ధానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులను మనుషులు గా చూడలేదు అని కేవలం ఆయన ఓటు బ్యాంకుగా మాత్రమే చూసారాని, ముస్లింలు అందరికి ఇస్లామిక్ బ్యాంకు ఒకటి మంజూరు చేస్తాం అని ఇప్పుడు ఆ బ్యాంకు ఎక్కడికి పోయింది అని ఆరోపణ చేసారు, చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మాట వేసే ప్రతి అడుగు మోసపూరితమే అని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments