తెలంగాణా ద్రోహి చంద్రబాబుతో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ కు వోట్ వెయ్యాలా?

Wednesday, September 19th, 2018, 09:58:39 PM IST

తెలంగాణా ముందస్తు ఎన్నికల ప్రచార నిమిత్తం ఆ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ పైన మరియు చంద్రబాబు నాయుడు ఒక ద్రోహి అంటూ ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తెలంగాణలో మహాకూటమిల పేరిట ఏర్పడుతున్న అన్ని పార్టీలను కడిగి పారేశారు.

తెలంగాణా లోని జనమంతా కెసిఆర్ వైపే ఉన్నారని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు అర్ధమయ్యిపోయిందనీ, వాళ్లకి ఓట్లు పడేలా లేవు అని,అందుకే అందరు పొత్తులు కట్టుకుంటున్నారని విమర్శలు చేశారు.2009 డిసెంబరులో తెలంగాణా ఇస్తున్నాం అని ప్రకటించి వెనక్కి తీసుకోవడంతో 1200 మంది ప్రాణాలు తీసుకున్నారని,దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.వీరు అందరు కేవలం వారి సీట్ల కోసమే కలుస్తున్నారని ప్రజల సేవ కోసం కాదు అని ధ్వజమెత్తారు.ఈ రోజు రాహుల్ గాంధీ,వారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్నారు.వారు అలా ఇచ్చినట్టయితే తెలంగాణాకి అన్యాయం చేసినట్టు కాదా? అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు.పోలవరానికి జాతీయ హోదాని ఇచ్చి ప్రాణహిత తెలంగాణాకు మొండి చెయ్యి చూపించినందుకు ఓట్ వెయ్యాలా అని అడిగారు.అధికార దాహంతో కుర్చీ కోసం తెలంగాణా ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు తో చేతులు కలుపుతున్నందుకు ఓట్ వేయాలా అని ఏకి పారేశారు.