సినిమా రచ్చపై బాబు ఫస్ట్ రియాక్షన్ !

Tuesday, October 17th, 2017, 03:39:13 PM IST

గత కొన్ని రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు దేశం పార్టీ నేతల వ్యాఖ్యలు, వాటికి వర్మ కౌంటర్లు వీటితోనే మీడియా మోతెక్కిపోతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రలోఅత్యంత వివాదభరిత పర్వాన్నే వర్మ సినిమాగా తీయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు, లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు, అప్పటి రాజకీయ అంశాలు అన్నీ వస్తాయి.

ఈ చిత్రం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని టిడిపి నేతలు భావిస్తుండడంతో వర్మపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. కాగా చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై తొలిసారి స్పదించారు. ఎన్టీఆర్ కారణజన్ముడని, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఆయన చేసిన సేవలని తెలుగువారు ఎన్నటికీ మరచిపోరని చంద్రబాబు అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ఆయన స్పందిస్తూ వర్మని వైసీపీ నేతలు కలవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ చిత్రంపై ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని బాబు వ్యాఖ్యానించారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా నేతలతో ఈ వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments