రెండు సీట్లు త్యాగం చేసిన చంద్రబాబు !

Thursday, October 25th, 2018, 03:00:17 AM IST

కేసిఆర్ ఓటమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణలో ఏర్పడిన మహాకూటమి అదే మాటకు కట్టుబడి నడుచుకుంటోంది. ఇన్నేళ్లు తమను అన్ని విధాలుగా తొక్కిపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టికరిపించాలనే సంకల్పంతో జట్టు కట్టిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టిజెఎస్ పార్టీలు ఊహించని విధంగా సర్దుకుపోతున్నాయి.

ఆరంభంలో ఉన్న 119 స్థానాల్లో 100కి పైగా తమ అభ్యర్థులే పోటీ చేస్తారని పట్టుబట్టిన కాంగ్రెస్ తర్వాత తర్వాత కూటమి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని 90కి తగ్గింది. అలాగే 30 సీట్లు గెలిచే సత్తా ఉందన్న టిజెఎస్ కూడ మెత్తబడింది. చంద్రబాబు కూడ టికెట్ల సంగతి మర్చిపోయి గెలుపు కోసమే కృషి చేయండి, అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు.

అంతేకాదు ముందుగా కూటమి పెద్ద కాంగ్రెస్ టీడీపీకి 17 స్థానాలు, టిజెఎస్ కు 8, సీపీఐకి 4 సీట్లు కేటాయించింది. అడిగినవి ఇవ్వకపోగా మరీ 8 సీట్లు మాత్రమే ఇస్తారా అంటూ కోదండరాం అలకబూని, కూటమి నుండి బయటికి వెళ్లిపోతామని సంకేతాలు ఇచ్చారు. గాడి తప్పుతున్న వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు రంగంలోకి దిగిన బాబు తమకు కేటాయించిన 17 స్థానాల నుండి 2 స్థానాలను కోందండరాం అభ్యర్థులకు త్యాగం చేశారట. దీంతో 10 స్థానాలు దక్కి కోదండరాం శాంతిచారని, ప్రస్తుతం అందరూ సంతృప్తిగా ఉన్నారని టాక్.