వై ఎస్ జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, October 10th, 2018, 03:17:54 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ తన పాదయాత్రలో ఎక్కడ పడితే అక్కడ వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు యొక్క వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపుతున్నారు.అయితే జగన్ యొక్క ఆరోపణలు విమర్శలకు గాను చంద్రబాబు ఎప్పుడు తన జవాబును తిరిగి వ్యక్తపరచలేదు,టీడీపీ కార్యకర్తలే జగన్ కు తగు సమాదానాలు ఇచ్చేసేవారు.ఇప్పుడు తాజాగా అనంతపురంలో నిర్వహించినటువంటి సభలో జగన్ పై చంద్రబాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి అహర్నిశలు కస్టపడి తాము పనిచేస్తున్నామని,కానీ కొంతమంది రాజకీయ నాయకులు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మాయ మాటలు చెప్తున్నారు అని మండిపడ్డారు,అదే సందర్భంలో జగన్ పై మాట్లాడుతూ,అసలు ఎలాంటి అనుభవం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇష్టమొచ్చిన హామీలిచ్చేస్తున్నారని,కనీసం పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కానీ జగన్ యొక్క ఆరాటం అంతా ఒక్కటే అని,ఒకవేళ తాను అధికారంలోకి వచ్చినట్టయితే ఆయన మీదున్న అవినీతి కేసులను కొట్టించుకోవడానికి మరియు తన ఆస్తులను కాపాడుకోవడనికి చూస్తున్నారని,అలాంటి వ్యక్తి ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చేస్తానంటున్నారు,జగన్ యొక్క వఖరి ఎలా ఉందంటే కొండకు ఒక వెంట్రుక కట్టి వస్తే కొండ పోతే వెంట్రుక అన్నట్టు ఉన్నారని,అలంటి జగన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుందని,అలాంటి వ్యక్తిని నమ్ముతారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.