చంద్రబాబు కన్ను కుర్రాళ్లపై పడింది !

Wednesday, September 19th, 2018, 10:12:31 AM IST

ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భాద్యతలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నట్టున్నాయి. అందుకే నాలుగేళ్లలో చేయని పనుల్ని ఈ ఏడెనిమిది నెలల్లో చేసేస్తామనే కలరింగ్ ఇస్తున్నారు. అందులో భాగంగానే యువతను తనవైపుకు తిప్పుకునేందుకు వరాలు కురిపిస్తున్నారు.

నిన్ననే శాసనసభలో ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా నమోదైన కేసుల్ని ఎత్తివేస్తామని ప్రకటించిన ఆయన కొన్ని రోజుల క్రితమే నిరుద్యోగ భృతిని సైతం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు యువతీ యువకుల్లో గుడ్ విల్ కొట్టేసేందుకు ఖాళీగా ఉన్న 20,010 ప్రభుత్వ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలచేస్తామని అన్నారు.

ఈ హైడ్రామాను గమనించిన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువకులు వీటిని నాలుగేళ్లుగా అమలుచేసి ఉంటే ఎంతో మంది లబ్ది పొంది ఉండేవారు కదా, ముఖ్యమంత్రిగారికి ఇప్పటికి గుర్తొచ్చామా మేము అంటుండగా ప్రతిపక్ష, విపక్షాలు ఎన్నికల సమయం ఆసన్నమవుతుండటంతో ఇన్నాళ్లు చేసిన అన్యాయాన్ని మరిపించేందుకే బాబు ప్రకటనలు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.