బాబు ప్లాన్.. బ్లాక్ మనీలో అమరాతికి వాటా..?

Thursday, November 17th, 2016, 02:48:02 PM IST

chandrababu
కరెన్సీ బ్యాన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ వైపు చర్చ జరుగుతుంటే మరో వైపు దీనివలన ఎంత మొత్తంలో బ్లాక్ మని కేంద్రానికి చేరనుందనే దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఇది నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా వెంకయ్య నాయుడు అభివర్ణించారు. దీనివలన బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ నిర్ణయం వలన రూ 3 లక్షల కోట్లకు పైనే కేంద్ర ఆర్ధిక శా కు వెసులు బాటు కలిగే అవకాశం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కేంద్రం వైపు చూసేలా చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం నిధులకొరత, లోటు బడ్జెట్ తో సతమత మవుతున్న ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించాలంటే ఇదే సమయమని చంద్రబాబు భావిస్తున్నారట. కరెన్సీ బ్యాన్ నేపథ్యంలో చాలా మొత్తంలో బ్లాక్ మని చిత్తు కాగితాలుగా మారుతాయి. ఈ లెక్కలన్నీ తేలితే కేంద్రానికి నల్ల ధనం ద్వారా ఎంత మొత్తం ఆదాయం వచ్చిందనేది తేలుతుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ మని ఆదాయంలో కొంతైనా అంధ్రప్రదేశ్ కు నిధుల రూపంలో పొందాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ మేరకు కేద్రాన్ని ఒత్తిడి చేయాలని చంద్రబాబు టిడిపి ఎంపీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన నిధులు రాజధాని నిర్మాణానికి, రాయల సీమ, ఉత్తరాంధ్ర లలో వెనుకబడిన ప్రాంతాలకు సరిపోవనే వాదన ఉంది. ఎలాగూ కేంద్రానికి బ్లాక్ మని ద్వారా ఆదాయం రాబోతోంది కాబట్టి.. ఏపీ ప్రత్యేక ప్యాకేజ్ లో నిధుల్ని పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై చంద్రబాబు ఏపీ ఎంపీలతో చర్చించారట.

ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజ్ విషయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేందం పై మంది పడుతున్నారు. పోలవరం విషయం లో కూడా కేంద్రం ఏపీని మోసం చేస్తోందని, కేవలం ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు విడుదల చేస్తా అది జాతీయ ప్రాజెక్టు ఎలా అవుతుందని జనసేనాని ప్రశ్నించారు. దీనిపై బిజెపి కూడా గట్టిగానే స్పందించింది. కేంద్రం ఏపీకి నిధులను బాగానే సమకూరుస్తుందని.. పవన్ కళ్యాణ్ సినిమాలకే నిధులు సమకూరుతున్నాయో లేదో చూసుకోవాలని ఏపీ బిజెపి ఇంచార్జ్ సిదార్థ్ నాథ్ సింగ్ అన్నారు. నిధుల విషయంలో బిజెపి పై చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నా బ్లాక్ మని ద్వారా ఏపీ కి నిధులు పొందాలన్న బాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.