రెడ్డి కేసును తన వైపుకు తిప్పుకునే పనిలో నాయుడు !

Sunday, September 30th, 2018, 12:08:13 PM IST

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ముఖ్యమంత్రి మెదడు తెగ పదునెక్కుతోంది. ప్రజల సానుభూతిని పొందేందుకు అందరూ తననే టార్గెట్ చేస్తున్నారనే కలరింగ్ ఇస్తున్నారు బాబు. మొన్నటికి మొన్న చిన్నపాటి బాబ్లీ కేసును అరెస్ట్ వార్నేట్ వరకు తెచ్చుకుని అది మోడీ కుట్రలో భాగమే అంటూ నానా యాగి చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణాలో రేవంత్ రెడ్డిపై జరుగిన ఐటీ దాడుల వెనుక ప్రధాన లక్ష్యం తానే అనేలా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు.

హోదా అడుగుతున్నామని, అవిశ్వాస తీర్మానం పెట్టామనే కక్షతో మోడీ బాబుపై ఉన్న ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డిపై దాడులు చేశారనే సారాంశాన్ని ఒక వర్గం మీడియాను ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. న్యాయవాది రామారావు పెట్టిన కేసులోని అంశాలను పక్కనబెట్టి ఐటీ శాఖ అధికారులు ఓటుకు నోటు కేసులో రేవంత్ వాడిన 50 లక్షలు ఎవరిచ్చారు అనే విషయంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, సెబాస్టియన్, ఉదయసింహాల ఇళ్లలో సోదాలు అందుకే చేశారని, వారిని కూడ 50 లక్షల విషయంపైనే ఎక్కువగా ప్రశించారని, మోడీ ఈ కేసును త్వరగా తేల్చేలా చర్యలు తీసుకోమని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆ మీడియా చేత చెప్పిస్తున్నారు.

ఎంతసేపటికి టీడీపీ నేతలు బాబుపై ఉన్న కేసును బయటికి తీస్తున్నారు, కక్ష సాధింపుకు వాడుకుంటున్నారు అంటున్నారే కానీ చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కనీసం ఆ దిశగా మాట్లాడటం లేదు కూడ. ఈ ముందస్తు డిఫెన్సును చూస్తుంటే బాబు ఎన్నికల నాటికి ఈ అంశాలన్నిటినీ బాగా వాడేసుకొని సానుభూతి ఓట్లు పొందాలని చూస్తున్నట్టే ఉంది.