గ్యాంగ్ సెట్ చేసుకుంటున్న చంద్రబాబు?

Thursday, May 24th, 2018, 02:45:30 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ పై ప్రస్తుతం ఎంత ఆగ్రహంతో ఉన్నారో అందరికి తెలిసిందే. ఎలక్షన్స్ కి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని ప్రతి సభలో క్లియర్ గా చెబుతున్నారు. అన్నిటికి భాజపానే కారణమని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుంటూ పోతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్న బాబు రీసెంట్ గా కేజ్రీ వాల్ ను కూడా కలిశారు. కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి గాను బెంగుళూరు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే అక్కడికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వచ్చారు. దీంతో కేజ్రీవాల్ తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ పాలన గురించి చర్చలు జరిపి లోకల్ పార్టీలన్నీ ఏకమవ్వాలని ఆయనతో చర్చలు జరిపారు. స్థానిక పార్టీలపై బీజేపీ పెత్తనం చెలాయిస్తోందని వారు చెప్పిన విధానాలకు లొంగకుంటే వివాద రకాలుగా విమర్శలు చేస్తోందని చంద్రబాబు మాట్లాడారు. అయితే చంద్రబాబు కేజ్రీవాల్ అనే కాకుండా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుపుకొని ఒక కూటమిగా వెళ్లాలని ఆలోచిస్తున్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ పై ప్రస్తుతం అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తరహాలోనే చంద్రబాబు కూడా సపరేట్ గ్యాంగ్ మెయింటేన్ చేస్తారా అనే టాక్ వస్తోంది. చూడాలి మరి ఆయన ఏ తరహాలో ముందుకు వెళతారో..

  •  
  •  
  •  
  •  

Comments