6 నెలలు 75 టార్గెట్లు.. చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Tuesday, June 12th, 2018, 04:15:16 PM IST

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ నాయకులూ అప్పుడే రాజకీయ ప్రణాళికలు మొదలు పెట్టారు. ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారాలు భారీగా సాగాయి. జగన్- పవన్ యాత్రలతో పాటు చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు చాలా వరకు జనలను ఆకట్టుకున్నాయి. ఎవరి స్టైల్ లో వారు ముందుకు సాగుతుంటే వచ్చే ఎలక్షన్ లో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని అర్ధమవుతోంది.

ఇకపోతే చంద్రబాబు ఈ సారి గట్టివ ప్లాన్ వేశారు. ఇంకా ఎన్నికలకు ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు నెలల్లో 75 కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకోసం ముఖ్యమంత్రి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సాధికార మిత్రలతో ముఖాముఖి అలాగే 13 జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీల విద్యార్థులతో భేటీ అవుతున్నట్లు చెప్పారు. ఇక ప్రతి నియోజక వర్గంలో స్థానిక నేతల బలం ఎంత వరకు ఉందొ అనే విషయంపై సీఎం ప్రతి 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించనున్నారు. కొన్ని స్థానాల్లో సీనియర్ నేతల పర్యటనలను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు ఆరు నెలల్లో టీడీపీ బలాన్ని మరింత పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు నిర్ణయనించుకున్నారు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments