ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఎవ‌రూ ఊహించ‌ని మ్యాట‌ర్..!

Tuesday, October 9th, 2018, 02:46:22 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుటుంబానికి.. సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కొంత‌కాలంగా మంచి రిలేష‌న్ లేని సంగ‌తి అంత‌రికీ తెలిసిందే. గ‌తంలో తార‌క్‌ని రాజ‌కీయంగా వాడుకొని వ‌దిలేయ‌డ‌మే కాకుండా.. ఎన్టీఆర్ మ‌రోసారి రాజ‌కీయల వైపు చూడ‌కుండా తొక్కేసిన చంద్ర‌బాబు.. త‌న కొడుడు నారా లోకేష్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఎన్టీఆర్ బ్రేక్ వేస్తాడ‌ని ముంద‌గానే ఊహించిన చంద్ర‌బాబు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని క‌ట్ చేయ‌డ‌మే కాకుండా త‌న చిత్రాల విడ‌ద‌ల టైమ్‌లో కూడా ఆటంకాలు సృష్టించారు.

అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో.. తారక్ తాజాగా నంటించిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం ఈ నెల 11న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌తంలో ఎన్టీఆర్ చిత్రాల‌కు ఎక్స‌ట్రాషోల‌కి ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టిన చంద్ర‌బాబు.. ఈసారి మాత్రం అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రానికి అధ‌నంగా రెండు షోలు వేసుకోవ‌డాని ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంమే కాకుండా.. సినిమా విడుద‌ల అవుతున్న తేదీ 11వ తారీకు నుండి.. 18వ తారీకు వ‌ర‌కు ఎక్స్‌ట్రాషోలు వేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో.. ఇప్పుడు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యంది. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత‌మంది ఖుషీగా ఉన్నా మ‌రికొంత‌మంది మాత్రం రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే.. మ‌ళ్ళీ ఎన్నీఆర్‌ను కాకా ప‌ట్ట‌డానికే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని.. అందులో భాగంగానే తారక్ చిత్రానికి అద‌న‌పు షోలు వేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ని చ‌ర్చించుకుంటున్నారు.