షాకింగ్ : నేను పార్టీ మారితే చంద్రబాబు 50 కోట్లు,మంత్రి పదవి ఇస్తానన్నారు..వైసీపీ నేత

Thursday, October 18th, 2018, 12:30:52 PM IST

ఈ రోజు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఆలూర్ ఎమ్మెల్యే గుమ్మనూర్ జైరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ నుంచి మారిపోయిన ఎస్ వి మోహన రెడ్డి, భూమా రెడ్డిలలా తాను తన పార్టీని మోసం చెయ్యలేనన్నారు.వాళ్లు డబ్బులకు అమ్ముడుపోయే మనుషులని నేను అలంటి వాడిని కాదని మండిపడ్డారు.ఈ రోజు దేవరకొండ మండలం ప్ కోటకొండ గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్లగా అక్కడి గ్రామస్థులు ఆయన్ని అడ్డుకొని ఇక్కడ పనులేమీ జరగడం లేదని వాపోగా ఈయన వారి మీద మండిపడ్డారు.అదే సందర్భంలో వారిపై మండిపడుతూ తాను వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరితే చంద్రబాబునాయుడు తనకి 50 కోట్ల రూపాయలు మరియు మంత్రి పదవిని కట్టబెడతానని చెప్పగా తాను వాటిని వెంట్రుకతో సమానంగా తీసి పక్కన పడేసానే కానీ పార్టీ మాత్రం మారలేదని చెప్పుకొచ్చారు.తనవల్లే ఈ ప్రాంతానికి ఇంత పేరొచ్చిందని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆ గ్రామస్థులకు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments