జగన్ కి కరెంట్ షాక్..బాబు మరో దెబ్బ..!!

Friday, September 29th, 2017, 08:15:14 AM IST


ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాల్లో వేస్తున్న ప్రతి అడుగూ రాబోవు ఎన్నికల ప్రణాళికే అని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటన కరెంటు విషయంలో చేసిన ప్రకటన రైతులకు, మధ్యతరగతి వారికి వరంకాగా..వైసీపీకి షాక్ కొట్టింది. రాబోవు రోజుల్లో అనగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో సాధించిన విజయాన్ని బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. తెలంగాణ విభజన తరువాత ఏపీ ప్రభుత్వాన్ని 16 వేల కోట్ల ఆర్థిక లోటు మరియు 22మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. కరెంటు కొరతతో ప్రభుత్వం పరిశ్రమల నుంచి 25 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. దీనితో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా విజయం సాధించామని చంద్రబాబు అన్నారు.

రాబోవు రోజుల్లో కూడా విద్యుత్ చార్జీలు ఏ మాత్రం పెంచబోమని ప్రకటించారు. విద్యుత్ విషయంలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయం కొంత వరకు వాస్తవమే అయినా..దీనిని పొలిటికల్ అజెండాగా మార్చుకోవడంలో చంద్రబాబు 100 శాతం విజయం సాధించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావం పక్షం పై కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. విద్యుత్ అంశంలో చంద్రబాబు రైతుల వద్ద మంచి మార్కులు కొట్టేసే అవకాశం ఉండడంతో టీడీపీని ఇరుకున పెట్టె అంశాలకోసం వైసిపి సెర్చింగ్ మొదలు పెట్టింది.

రాజధాని భూములు, పోలవరంప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతిని ప్రాజెక్ట్ చేయడంలో వైసిపి విఫలం చెందింది. 2019 ఎన్నికలని టార్గెట్ చేసుకుని బాబు ప్రచారం మొదలు పెట్టడంతో ఇకనైనా తమ వ్యూహాలకు పదును పెట్టాలని జగన్ భావిస్తున్నారట. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ పై వ్యతిరేకత లేదని తేలింది. ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండడంతో చంద్రబాబు పబ్లిసిటీ, జగన్ వ్యూహాలు ఏది విజయం సాధిస్తాయో అనే ఆసక్తి నెలకొని ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments