కడపని దున్నేస్తున్నాడు..అద్భుతం జరిగే అవకాశం ఉందా..?

Sunday, November 27th, 2016, 10:49:34 AM IST

babu
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా మద్దత్తు ఎలా ఉన్న సోహాటన్ జిల్లా కడపలో తిరుగు లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా తన దృష్టినంతటిని కడపైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో టిడిపి నేతలతో బద్ద శత్రుత్వం ఉన్న ఆదినారాయణ రెడ్డి వంటి నేతలు కూడా టిడిపి చేరారు. చంద్రబాబు 2019 ఎన్నికలలోగా కడపలో జగన్ ని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భావిస్తున్నాడట. సొంత జిల్లా లోనే జగన్ దెబ్బ కొడితే టిడిపి కి తిరుగుండదని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా చంద్రబాబు శనివారం కడప జిల్లాలోని రాజంపేటలో జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై పరోక్షంగా పలు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి దివాళా కోరు తనం ప్రదర్శిస్తోందని, నేరాలు ఘోరాలకు పాల్పడే నాయకుడిని ప్రజలు నామాంరని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు లో ప్రతిపక్షం ఉండదని ఉన్నా సింగిల్ డిజిట్ ఫలితాలే ఉంటాయని బాబు జోస్యం చెప్పారు. ప్రజలకు మేలు చేకూర్చే పట్టి సీమని పార్థి పక్షం అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, పట్టి సీమ పూర్తవడం వాళ్ళ శ్రీశైలం జలాశయం నీటిని అధికంగా సీమకి కల్పించే అవకాశం వచ్చిందని చంద్రబాబు అన్నారు.కాగా కడపలో వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఆధిక్యం లో నిలపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపిని వెనక్కి నెట్టి కడప జిల్లాలో టిడిపి ఆధిక్యంలోకి వస్తే అది అద్భుతమే అని విశ్లేషకులు అంటున్నారు.