ఆ విధంగా ముందుకు పోతున్న చంద్రబాబు…!

Friday, November 9th, 2018, 03:48:45 PM IST

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని జాతీయ పార్టీలను ఇక తాటి పైకి తీసుకు వచ్చేందుకు బాబు తెగ కష్ట పడుతున్నాడు. వరుస పెట్టి అందరు జాతీయ పార్టీల అధ్యక్షులతో భేటీ అవుతూ దేశం అంతా చుట్టేస్తున్నారు. అమరావతిలో నిర్వహించబోయే ధర్మపోరాట ముగింపు సభలో అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలను ఒకే తాటి పైకి తీసుకురావటమే ఈ భేటీల యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సభలు, ర్యాలీలకు బాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.

డిసెంబర్ చివర్లో ధర్మపోరాట దీక్ష ముగింపు సభ జరపాలని బాబు భావిస్తున్నారట, అలాగే జనవరి నుండి దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి చే బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. కర్ణాటకలో రైతులతో జనవరి చివరి వరంలో సభకు ప్రణాళిక సిద్ధం చేశారట, కర్ణాటక సభ తర్వాత ఉత్తరప్రదేశ్ లో కూటమి తరఫున బారి ర్యాలీ చేపట్టేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి అటు కేంద్రంలో బీజేపీ ని గద్దె దించి, ఇటు రాష్ట్రంలో ఎలాగైనా టీడీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు వయసుకు మించిన శ్రమ పడుతున్నారు, ఆయన కృషి ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments