అవసరమైతే రాహుల్ గాంధీతో మాట్లాడతా.. పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బాబు!

Sunday, September 9th, 2018, 11:00:07 AM IST

దేశ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలే కీలకంగా మారనున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణాలో చాలా స్పీడ్ మరో ఎన్నికలు రావడంతో మరోసారి స్థానిక పార్టీనే విజయం సాధిస్తుందా? లేదా అనేది అందరిలో ఆసక్తిని రేపింది. ఇకపోతే టీఆరెస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పొత్తులతో ముందుకు సాగుతోంది. చూస్తుంటే మహాకూటమితో కేటీఆర్ ను ఎదుర్కోవడానికి అంతా సిద్దమైనట్లు సమాచారం.

ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు పెద్దిరెడ్డి, దేవేందర్ రెడ్డి, రావుల, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికలకు సంబందించిన ప్రణాళికలు గురించి నాయకులతో చర్చించారు. అయితే కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లు, ఒకటి లేదా రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకు చంద్రబాబు ఆలోచనలో పడ్డారు.

గెలిచే సామర్ధ్యం ఉన్న ప్రతిచోటా నాయకులను పోటీకి దింపాలని కనీసం 25 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలను టీడీపీ ఖాతాలో ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారట. స్థానిక కాంగ్రెస్ నేతలు అందుకు నిరాకరిస్తే పార్టీ జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధీతో మాట్లాడతానని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. మరి ఇలాంటి సమాయంలో కాంగ్రెస్ నేతలు ఏ;ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments