రాజకీయ వర్గాల్లో సంచలనం..వైసీపీతో పొత్తుకు సిద్ధం..చంద్రబాబు.!

Monday, February 11th, 2019, 09:17:13 PM IST

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రత్యేకహోదా అంశం పై వారి క్యాడర్ అంతటిని తీసుకెళ్లి మోడీకి మరియు కేంద్రానికి వ్యతిరేఖంగా ధర్మ పోరాట దీక్ష చేసిన సంగతి తెలిసినదే.అయితే ఈ దీక్ష సమయంలో చంద్రబాబు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఒక పక్క సోషల్ మీడియాలోనూ అలాగే రాజకీయ వర్గాల్లోనూ పెద్ద సంచలనానికే తెర లేపాయి.చంద్రబాబు ఇప్పటి వరకు ఏ పార్టీ తోను పొత్తులు లేకుండా నడిచింది లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట దాన్ని ఇప్పుడు చంద్రబాబు మరోసారి నిజం చేసేసారు.

ఇప్పటి వరకు తాను పవన్ తో పొత్తుకు సిద్ధమని బహిరంగంగానే ప్రకటించేసారు.అయితే వాటిని పవన్ తిప్పి కొట్టగా ఇప్పుడు వైసీపీతో పొత్తుకు బాబు సిద్ధమంటున్నారు.ఢిల్లీలోని ఒక న్యూస్ ఛానెల్ విలేఖరి జగన్ తో మీరు కలిసి నడిచేందుకు సిద్ధమేనా అని అడిగితే బాబు నిర్మొహమాటంగా ఆయన వస్తే సిద్ధమే అని ప్రకటించేసారు.దీనితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ఈ రెండు పార్టీల పొత్తులపై రచ్చ నడుస్తుంది.మరి నిజంగానే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో లేదో చూడాలి.