పంచాయితీ ఎన్నిక‌లకు సిద్ధ‌మే అన్న‌ చంద్ర‌బాబు.. తెర‌పైకి మ‌రో మెలిక‌..?

Wednesday, October 24th, 2018, 04:00:50 AM IST

ఏపీలో పంచాయితీ ఎన్నిక‌లు మూడునెల‌ల్లో నిర్వ‌హించాల‌ని ఉమ్మ‌డి హైకోర్టు ఏపీ స‌ర్కార్‌కి ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా స్పెష‌ల్ ఆఫీస‌ర్ల పాల‌న‌ను కొన‌సాగిస్తూ జారీ చేసిన జీవో నెంబ‌ర్ 90ను హైకోర్టు కొట్టివేసింది. అయితే పంచాయితీ ఎన్నిక‌ల పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు.

ఏపీలో పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవ‌ని.. రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టానికి సంబంధించిన అంశం కోర్టు ప‌రిధిలో ఉండ‌డం వ‌ల్ల‌నే పంచాయితీ ఎన్నిక‌ల‌కు ఆల‌స్యం అవుతోందని చంద్ర‌బాబు తెలిపారు. అయితే రిజ‌ర్వేష‌న్ల అంశం త్వర‌గా తేలితే.. వెంట‌నే తాము పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించేదుకు సిద్ధ‌మ‌ని.. స్థానికి సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే టీడీపీ ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఇక మ‌రోవైపు పంచాయితీ ఎన్నిక‌ల పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పందించారు. టీడీపీ ప్ర‌భుత్వానికి పంచాయితీ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే ధైర్యం లేక‌నే పంచాయితీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంలేద‌ని.. అయితే ఇక‌నైన హైకోర్టు ఆదేశాలు గౌర‌వించి పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక స్థానిక సంస్థ‌ల అధికారాలు నిల‌బెట్టేలా హైకోర్టు తీర్పు ఇవ్వ‌డం చాలా మంచి ప‌రిణామ‌మ‌ని.. జీవోనెంబ‌ర్ 90ను కూడా హైకోర్టు ర‌ద్దు చేయ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments