కొత్త నీతులు చెబుతున్న చంద్రబాబు – ధర్మమే తనని కాపాడుతుందంట…

Wednesday, May 15th, 2019, 11:40:19 PM IST

ఎన్నికల ఫలితాలు విడుదలవడానికి దగ్గరవుతున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కొత్త నీతులు వల్లిస్తున్నాడు… కాగా నేడు చంద్రబాబు రాజధాని అమరావతిలో ప్రవాసాంధ్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేకమైన అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇన్నేళ్ల పరిపాలనలో తాము ధర్మంగానే అన్ని పనులన్నీ చేశామని, అందుకోసమనే ప్రజల్లో తమకి అపారమైన నమ్మకం పెరిగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేశామని, అంతేకాకుండా ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడా ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండ జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాల్లో చాలా చక్కటి ప్రదర్శనాని కనబరిచారని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.

రానున్న రోజుల్లో ఏపీలో అన్ని పనులకి సహకరించాలని, భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి తోడు అందించాలని చంద్రబాబు ప్రవాసాంధ్రులని కోరారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత, తాము సాధించిన విజయం తరువాత మరోసారి భేటీ అవడానికి నిర్ణయించుకున్నారని, కాగా ఫలితాలలో తామే అఖండ విజయాన్ని సాదించబోతున్నామని చంద్రబాబు అందరికి సూచించారు. కాగా ముందస్తు సర్వే ఫలితాలని చూసి ఆందోళనకి గురవ్వద్దని, తాము విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు అన్నారు.