చంద్రబాబు & కో సీక్రెట్ మీటింగ్: లగడపాటి, అను”కుల” మీడియా హెడ్ తో సీక్రెట్ మీటింగా..?

Tuesday, January 29th, 2019, 01:12:01 PM IST

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనదైన వ్యూహ రచనతో రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఆయన, ఈ సారి ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనికలను ఉద్దేశించి హామీలు ఇస్తూ వాటిని ఎన్నికలకు ముందే అమలు పరుస్తూ తన మార్క్ రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడే చంద్రబాబు రాబోయే ఎన్నికలను ఉద్దేశించి మరోసారి తనదైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. లగడపాటి రాజగోపాల్ తో కలిసి మరోసారి మోసానికి పాల్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి, చంద్రబాబునాయుడు నివాసంలో మాజీ ఎంపి, ఎన్నికల సర్వేలు చేయటంలో మొన్నటి వరకూ మంచి క్రెడిబులిటీ ఉన్న లగడపాటి రాజగోపాల్, చంద్రబాబుకు మద్దతిచ్చే ఆయన అను”కుల” మీడియా అధిపతి రహస్య సమావేశం జరిగినాట్లు సమాచారం. ముగ్గురి మధ్య దాదాపు గంటకుపైగా కీలక సమావేశం జరిగిందట, వాస్తవానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యకిటీకి ఒక మాజీ ఎంపీ, ప్రాంతీయ మీడియా అధినేతలతో రహస్యంగా సమావేశం అవ్వాల్సిన ఆవాసరం లేదు, ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేల ఈ ముగ్గురు రహస్య మిత్రుల భేటీ పలు అనుమానాలకు దారి తీస్తోంది, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాగానే ఏపీ ఎన్నకలకు ముందు సర్వేలు నిర్వహించి వాటిని తమ కమ్మనైన మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో గెలవాలని బాబు ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టం అవుతుంది, ఈ మేరకు వైసీపీ, జగన్ మీడియా కూడా ఆరోపిస్తుండటం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లగడపాటి చేత బాబు చేయించిన సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లగడపాటి సర్వేలతో అను”కుల” మీడియాతో ఊదరగొట్టి ప్రచారం చేయించి జనాల మైండ్ సెట్ మార్చాలని విశ్వప్రయత్నం చేసారు అయితే తర్వాత వచ్చిన ఫలితాల్లో జనాలు బాబు అండ్ కో బ్యాచ్ కి మూతి పగిలిపోయే రిజల్ట్ ఇచ్చారు. ఫలితంగా లగడపాటి సర్వేలపై ప్రజల్లో ఉన్న క్రెడిబులిటీ కాస్తా అదః పాతాళానికి పడిపోయింది. ఒక సారి తమ చావు తెలివితేటలతో తల బొప్పి కట్టించున్న యెల్లో బ్యాచ్ మల్లి అదే ప్రయత్నం చేస్తున్నట్లుంది, రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.