ల‌గ‌డ‌పాటి, ఆర్కేతో.. చంద్ర‌బాబు అర్ధ‌రాత్రి రాజ‌కీయాలు..వైసీపీ సంచ‌ల‌నం..!

Tuesday, January 29th, 2019, 03:40:08 PM IST

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌వైపు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్ని పార్టీల‌తో అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయ‌గా.. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అర్ధ‌రాత్రి రాజ‌కీయాలకు తెర‌లేపారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా చంద్ర‌బాబు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్, ఏబీఎన్ రాధాకృష్ణ ర‌హ‌స్యంగా స‌మావేశం అయ్యార‌నే వార్త రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే అట్ట‌ర్ ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌ర్వేల‌న్నీ టీఆర్ఎస్ వైపు నిల‌చినా, ఒక్క ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాత్రం మహాకూట‌మికి అనుకూలంగా స‌ర్వే ఫ‌లితాలు విడుద‌ల చేసి, బొక్క‌బోర్లా ప‌డింది.

అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ఈ ముగ్గురు భేటీ అవ‌డంతో రాజ‌కీయవ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ర‌హ‌స్యంగా జ‌రిగిన ఈ స‌మావేశంకు సంబంధించి ఫొలోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ నేత అంబ‌టి రాంబాబు స్పందించారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో అక్క‌డి ఓట‌ర్ల‌ను గంద‌ర‌గోళం చేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తూ.. చంద్ర‌బాబు- ల‌గ‌డ‌పాటి వేసిన ఎత్తులు తెలంగాణ ప్ర‌జ‌లు తిప్పికొట్టార‌ని, అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నిక‌లు రానున్న నేప‌ధ్యంలో స‌ర్వేల పేరుతో ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించి, వైసీపీని దెబ్బ‌తీయాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ఇక త్ర‌వ‌లోనే ఏపీలో మ‌రోసారి టీడీపీదే విజ‌య‌మ‌ని ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, అయితే ఆ స‌ర్వేల‌తో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, నాలుగేళ్ళుగా ప్ర‌జ‌లను మోసం చేస్తూ వ‌స్తున్న టీడీపీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని అంబ‌టి రాంబాబు అన్నారు.