చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం.. అదే జ‌రిగితే రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లే..?

Friday, October 19th, 2018, 02:06:43 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్యం గురించి తెలియ‌ని తెలుగు ప్ర‌జ‌లు ఉండ‌రు. ఆయ‌న రాజ‌కీయ వ్యూహాలు ప‌రిస్థితుల‌ను బ‌ట్టు ఎలాగైనా మార్చుకోవ‌డంలో త‌న‌కు తానే సాటి. అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. విభ‌జ‌న టైమ్‌లో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌ని సంత‌కాలు చేసిన నాటి ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ నేత‌లు.. ఆ త‌ర్వాత అదికారంలోకి వ‌చ్చాక మాట మార్చి ప్ర‌త్యేక ప్యాకేజీ తెర‌పైకి తెచ్చి నానా ర‌కాలుగా డ్రామాలు ఆడిన సంగ‌తి తెలిసిందే. దీందో బీజేపీతో మిత్రం ప‌క్షంగా ఉన్న టీడీపీ వారితో దోస్తీకి క‌టీఫ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా చంద్రబాబు ఏపీ ప్ర‌త్యేక‌హోదా పై రాజ‌కీయంగా వ్యూహాత్మ‌క‌మైన అడుగులు వేయ‌నున్నార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌త్యేక‌హోదా విష‌యం పై ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేస్తూ బీజేపీ పై యుద్ధం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు త‌న మేధ‌స్సుకు ప‌దును పెట్టి.. త‌న పంథాను మార్చుకోబుతున్నార‌నే టాక్ టీడీపీ వ‌ర్గాల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా మీ..టూ ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మీ..టూ దెబ్బ‌కి ఏకంగా కేంద్ర‌మంత్రి ఎంజే అక్బ‌ర్ రాజీనామా చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీంతో మీ..టూ త‌ర‌హా ఉధ్య‌మాన్ని తెర‌పైకి తెచ్చి చంద్ర‌బాబు బీజేపీ పై ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ పై ఒత్తిడి తేవాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నాని స‌మాచారం. మ‌రి చంద్ర‌బాబు ప్లాన్ తెర పైకి వ‌స్తే ఎలాంటి సంచ‌నాలు సృస్టిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments