చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్.. ఇప్పుడేం చేస్తారు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ టాపిక్..!

Wednesday, November 14th, 2018, 02:56:43 AM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష అధినేన‌ జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయ‌త్నంలో భాగంగా జరిగిన దాడి పై హైకోర్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న పై జరిగిన హత్యాయత్నం విషయంలో థర్డ్ పార్టీ విచారణను ఆదేశించాలని కోరుతూ వైసీపీ హై కోర్టును ఆశ్రయించగా.. విచార‌ణ జ‌రిపిన హైకోర్టు చంద్ర‌బాబు, డీజీపీతో స‌హా ఎనిమిది మందికి నోటీసులు ఇస్తూ రెండు వారాల్లో స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించింది హైకోర్టు. దీంతో జ‌గ‌న్ పై దాడి కేసు ఇప్పుడు ఆశ‌క్తిదాయ‌కంగా మారింది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత.. వివాదాస్ప‌ద విమ‌ర్శ‌లు చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు హైకోర్టుకు ఏమ‌ని స‌మాధానం చెబుతారో అని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మ‌రోవైపు సినీ న‌టుడు శివాజీ తెర‌పైకి తెచ్చిన ఆప‌రేష‌న్ గ‌రుడ పై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ త‌రుపున న్యాయ‌వాది హైకోర్టులో ప్ర‌స్తావించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జ‌గ‌న్ పై దాడి కుట్ర‌లో భాగంగానే జ‌రిగింద‌ని దీంతో స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌న జ‌రిపించాల‌ని కోర్టును కోరార‌ని స‌మాచారం. దీంతో రెండు వారాల్లో జ‌గ‌న్ పై దాడి కేసు విష‌యంలో సీల్డ్ క‌వ‌ర్ నివేదిక ఇవ్వాల‌ని సిట్ అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. మ‌రి హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేప‌ధ్యంలో చంద్ర‌బాబు నుండి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో అని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.