కెసిఆర్ తో కలిసి పని చేయడమా – చంద్రబాబు సంచలన సమాధానం

Saturday, May 18th, 2019, 04:00:08 AM IST

రానున్న ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలేమి కూడా కనిపించడం లేదు. అందుకోసమని కేంద్రంలో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం కానుంది. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో కలిసి పని చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు ఇతర పార్టీల నాయకులని తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ కూటమిలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కూడా కలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే జాతీయస్థాయిలో టీఆర్ఎస్‌లో కలిసి పని చేసే అంశంపై చంద్రబాబు స్పందించారు.

విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబుని జాతీయస్థాయిలో టీఆర్ఎస్‌లో కలిసి పని చేస్తారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి చంద్రబాబు స్పందిస్తూ తనదైశ శైలిలో సమాధానం ఇచ్చారు… బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఎవరు తమతో కలిసి వచ్చినా వారితో కలిసి పని చేస్తామని, అందరిని కలుపుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. కాగా టీఆర్ఎస్‌తో కలిసి పనిచేయడంపై మాట్లాడటానికి ఇష్టపడని చంద్రబాబు, బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా వచ్చిన కూడా వారితో కలిసి పనిచేయడానికి సిద్దమనే చెప్పారు చంద్రబాబు.