చంద్రబాబు సర్వే అవుట్.. మిత్రులారా ప్లీజ్ నమ్మండి..!

Monday, April 15th, 2019, 07:05:46 PM IST

ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నకల రిజల్ట్ తమకు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని మొత్తం 175 సీట్లకు గానూ 110 నుండి 140 సీట్లు వస్తాయని చంద్రబాబు జ్యోస్యం చెప్పారు.

తాజాగా అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు టీడీపీ పోరాటం చేస్తోందని, మరోవైపు బీజేపీ వైసీపీలు మాత్రం అరాచకాలు క్రియేట్ చేస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు.

ఇక ఎన్నికల వేళ టీడీపీ నేతల పై ప్రతీరోజూ దాడులు జరిగాయనీ, అయితే వాటిని తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 8 లక్షలకు పైగానే ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

అయితే టీడీపీ శ్రేణులు సకాలంలో స్పందించి వాటిని భగ్నం చేయగలిగామని చంద్రాబు చెప్పారు. తన పిలుపుతో ఓట్లు వేయకుండా వెనక్కి వెళ్లిపోయిన వారు కూడా మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. అసలు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.