జగన్ చేసింది కూడా ఒక‌ పాదయాత్రేనా.. చంద్ర‌బాబు సంచ‌ల‌నం..!

Friday, January 11th, 2019, 09:20:00 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్ర‌తి వారం ఇంటికి వెళుతూ చేసిన పాద‌యాత్ర‌కి ప‌విత్ర‌త ఎక్క‌డ ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గ‌తంలో చేసిన పాద‌యాత్ర గురించి చెబుతూ.. తాను అర్ధ‌రాత్రి దాకా కొన్ని రోజులు న‌డిచిన సంద‌ర్భాలు ఉన్నాయిని, జ‌గ‌న్ ఏనాడైనా రాత్రి 7 గంట‌లు త‌ర్వాత పాద‌యాత్ర చేశారా.. ఆ రోజుల్లో నాకు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క పోయినా, పాద‌యాత్ర చేశాన‌ని, అందుకే ప్ర‌జలు త‌న‌ను దీవించార‌ని చంద్ర‌బాబుబు అన్నారు.

ఇక కేంద్రంతో విడిపోయాక ఆంధ్రప్రదేశ్ మరింత కష్టాల్లో పడిపోయిందని.. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా.. అనేక సంక్షేమ కార్య‌క్రమాలు ప్ర‌జ‌ల‌కు చేరేలా చేస్తున్నామ‌ని బాబు అన్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పై మంద్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్రదేశ్‌లో పాద‌యాత్ర‌కు ఒక ప‌విత్ర‌త ఉంద‌ని, జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర అప‌హాస్యం చేసే విధంగా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ మోహ‌న్ ఏన్నేళ్లు అయినా రాజ‌కీయ అనుభ‌వం రాద‌ని, 13 జిల్లాలు తిరిగి, పాద‌యాత్ర ముగింపు రోజున స‌రైన రీతిలో విశాల‌మైన మైదానంలో భారీ స‌భ పెట్ట‌లేక‌పోయాన‌ని అస‌లు ఇన్నిరోజులు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన భ‌రోసా ఏంట‌ని అచ్చెన్న ప్ర‌శ్నించారు. మ‌రి చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.