అప్పుడు తమిళనాడు.. ఇప్పుడు కర్ణాటక : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Saturday, May 19th, 2018, 02:54:06 PM IST

శనివారం ఉదయం ఆంద్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి కర్ణాటక రాజకీయ విధానాలపై, కేంద్రం అవలంబించే పద్దతులపై దుమ్మెత్తి పోశారు. రోజులు గడుస్తున్నా కొద్దీ కర్ణాటకలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయన్నారు. రాజకీయాల్లో సీనియర్ ని పక్కకు తోసి మరో కొత్త వ్యక్తిని శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా ఎలా నియమిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ సంపాదించే సత్తా లేకున్నా కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భాజాపా ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని పన్నుతుంది అన్నారు. ఒకప్పుడు తమిళనాడులో ఇదే ప్రణాలికలను అవలంభించి అటు ప్రజలను, ఇటు నాయకులను మోసం చేసి ప్రబుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ కర్నాటక రాష్ట్రంలో ఇదే తలకు మాసిన పనులు చేస్తూ కొత్త పన్నాగం పూనుతుంది అని అన్నారు.

అధికారంలో ఉన్నాం కదా అని మాయమాటలు చెప్పి మోసం చేయడం కేంద్రానికి కొత్తేం కాదని, నాలుగేళ్ల క్రితం మోధీ, అమిత్ షాలు ‘ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మించి మోసగించి ఇప్పుడు మాకేం తెలియదన్నట్టు అమాయకుల్లా ప్రవర్తిస్తున్నారు. అప్రజాస్వామ్య విధానాలను పాటిస్తూ దేశానికే తలమానికం తెస్తున్నారు. అసలు ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేయడం ఇన్నేళ్ళుగా ఏ పార్టీలోనైనా చూసామా అని ప్రశ్నించారు. దేశాన్ని ఉద్దరిస్తాం అని చెప్పి ఇప్పుడు అన్ని రాష్ట్రాలని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకొని సర్వ నాశనం చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించాడు.

  •  
  •  
  •  
  •  

Comments