జగన్ కోడి కత్తి డ్రామా అందరికి తెలిసిపోయింది..చంద్రబాబు ఫైర్..!

Tuesday, October 30th, 2018, 06:30:30 PM IST

మొన్న 25వ తారీఖున విశాఖఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో హత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసినదే,రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ అంశమే ఒక్కసారిగా వేడెక్కించేసింది,టీడీపీ మరియు వైసీపీ ల మధ్య కూడా పెను దుమారానికి దారి తీసింది.మొదటి నుంచి జగన్ పై జరిగిన ఈ దాడి ముమ్మాటికీ చంద్రబాబే చెయ్యించాడని వైసీపీ వారు ముక్త కంఠంతో చెప్తున్నారు,అయితే వీరి యొక్క అందరి ఆరోపణలకు బ్రేక్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగినటువంటి ధర్మ పోరాట దీక్షలోని నిర్వహించిన సభలో జగన్ పై నిప్పులు చెరిగారు.

జగన్ తన మీద తానే చేయించుకున్న కోడి కత్తి డ్రామా అందరికి తెలిసిపోయిందని, దీనికి సాక్ష్యం ఆ దాడికి పాల్పడిన వ్యక్తే జగన్ పై సానుభూతి రావడం కోసమే చేశానని చెప్పాడు కదా అని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎయిర్ పోర్టులోని ఈ సంఘటన జరిగితే వైసీపీ వారు అది నా మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని,బాబు ఫైర్ అయ్యారు.నిందితుడి మీద విచారణకు ఇక్కడి పోలీసులను నమ్మరు కానీ కేంద్రంలోని పోలీసులను మాత్రం నమ్ముతారా అని దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.జగన్ పై దాడి జరిగిన సమయంలో ఒక పక్క భారత క్రికెటర్లు విశాఖలోనే ఉన్నారని,ఈ ఘటన ఇంకాస్త పెద్దది అయితే రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనే అప్పుడు మాట్లాడలేదని అన్నారు,అలాంటిది వైసీపీ వారు నన్ను ఏ1 ముద్దాయిగా చిత్రీకరిస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments