బిగ్ బ్రేకింగ్ : వివేకానంద‌రెడ్డి మృతి పై.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Friday, March 15th, 2019, 03:00:17 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పై ప‌లు అనుమాలు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వివేక‌నందారెడ్డి త‌ల‌కు గాయాలు అవ‌డంతో ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి పోలీసులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు పై స్పందించిన క‌డ‌ప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్ వ‌చ్చాక పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని, దోషులు ఎంత‌టి వారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.

ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. వివేకానంద‌రెడ్డి మృతి పై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల దిగ్భాంతి వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. వివేకానంద‌రెడ్డి మృతి పై అత్యున్న‌త స్థాయిలో ద‌ర్యాప్తు చేయాల‌ని, వెంట‌నే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్) నియ‌మించాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ క్ర‌మంలో నిందితులు ఏ స్థాయి వారైనా అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని చంద్ర‌బాబు కోరారు. ఈ క్ర‌మంలో ఈ కేసు ద‌ర్య‌ప్తు కోసం అడిష‌న‌ల్ ఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. మ‌రి సిట్ ద‌ర్యాప్తులో ఎలాంటి విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయో చూడాలి.