నేష‌న‌ల్ లీడ‌ర్ స్థాయినుండి, స్ట్రీట్ పొలిటీషియ‌న్ స్థాయికి దిగ‌జారిన చంద్ర‌బాబు..!

Saturday, May 4th, 2019, 08:02:55 AM IST


ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు అస‌లు ఏమైంది.. 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు తాజా ఎన్నిక‌ల్లో ఎదుర‌వనున్న ఓట‌మిని ఒప్పుకోలేక పోతున్నారా.. ఇదే ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ హాట్‌గా సాగుతున్న చ‌ర్చ‌.

2014లో గెలిచిన త‌ర్వాత టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుండ‌గి ఆయ‌న వైఖ‌రిలో గ‌తంలో చూడ‌ని మార్పు క‌నిపిస్తోంది.

గ‌తంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. అవినీతిని అభివృద్ధి చేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ అని చెప్పి ఒక్క‌సారిగా విమ‌ర్శ‌కుల‌కు టార్గెట్ అయ్యారు.
అలాటే నంద్యాల ఉపఎన్నిక‌ల టైమ్‌లో నేను వేసిన రోడ్ల‌మీద తిర‌గుతూ, నేను ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల వల్ల ల‌బ్ధి పొందుతూ.. నాకు ఓటు వేయ‌రా అంటూ బెదిరింపుల‌కుదిగారు చంద్ర‌బాబు.

ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్ధుల‌ను కొంటూ ఎలా బుక్ అయ్యారో అంద‌రికీ తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో ఎప్పుడైతే భ్రీఫ్‌మీ అంటూ చంద్ర‌బాబు దొరికారో అప్ప‌టి నుండి చంద్ర‌బాబు పూర్తిగా డిఫెన్స్ జోన్‌లోకి వెళ్ళిపోయారు.

ఇక అప్ప‌టి నుండి చంద్ర‌బాబు చేత‌ల‌కి, మాట‌ల‌కి అస్స‌లు పొంత‌న ఉండ‌డంలేదు. దీంతో రాను రాను పార్టీనేత‌ల పైనా, అదికారుల పైనా చంద్రబాబు గ‌తంలా కమాండ్ చేయ‌లేక‌పోతున్నారు.

అలాగే ఇప్పుడు తాజా ఎన్నిక‌ల టైమ్‌లో అయితే చంద్ర‌బాబు మాట‌ల‌ను జ‌నాలు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డంలేదు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయమైంద‌ని చంద్ర‌బాబుకు పూర్తి నివేధిక‌లు రావ‌డంతో, ఈవీయంల పై ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు.

ఇక తాజాగా స‌ర్వేల‌న్నీ వైసీపీ వైపు ఉన్నాయి. అలాగే రాజ‌కీయ‌నిపుణులు కూడా వైసీపీకే ఎక్కువ‌గా చాన్స్ ఉంద‌ని తేల్చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో అర్ధం కాక ఒక సాధార‌ణ వీధి స్థాయి రాజ‌కీయ‌నేత‌గా ప్ర‌వ‌ర్తించారు చంద్ర‌బాబు.

గెల‌పు ఓట‌ములు అనేవి చాలా స‌హ‌జం. అయినా చంద్ర‌బాబు చివ‌రి వ‌ర‌కు పోరాడుతాడ‌ని.. రాజ‌కీయాల్లో అత‌ని చాణ‌క్యం ఎప్పుడు ఎలా తిరుగుతుందో కూడా అర్ధం కాద‌ని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్య‌క్తం చేస్తుంటారు.

అలాంటి చ‌రిత్ర గ‌ల చంద్ర‌బాబు తాజాగా ఒక ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి.. స‌త్తార్ మార్కెట్, మ‌ట్కాల‌ను ప్రోత్స‌హించేలా మాట్లాడ‌డం, చీక‌టి కోణంలో ఉన్నవారు త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని, మాఫియా మ‌న వెన‌కాల ఉంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం.. ఆయ‌న పొలిక‌ల్ లైఫ్‌లో మ‌రో మ‌చ్చ‌గా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఏది ఏమైనా చంద్ర‌బాబుకు ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేలిపోయినా, ఆయ‌న ఓట‌మ‌ని అంగీక‌రించే ప‌రిస్థితుల్లో లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక చంద్ర‌బాబు ఎలాంటి కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతారో చూడాలి.