కులానికి కొన్ని సీట్లు పంచిన చంద్రబాబు – గెలుపు కోసమేనా…?

Friday, March 15th, 2019, 07:24:30 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు గత రాత్రి ఎన్నికలో పోటీ చేయు 126 అభ్యర్థులను ప్రకటించారు. మిగతా శతనాల్లో పోటీ చేయు అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించనున్నాడు. కాగా నిన్న ప్రకటించిన జాబితాలో చంద్రబాబు కేవలం మూడు కులాలను దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను సిద్ధం చేశారని చాల స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ జాబితాలో ముస్లింలకు కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించగా, బ్రాహ్మణా కులానికి చెందిన అభ్యర్థులకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం పలు అనున్మానాలకు దారి తీస్తుంది.

కాగా చంద్రబాబు తన సామజిక వర్గానికి చెందినటువంటి కమ్మ నేతలకు మాత్రం ఈ జాబితాలో పెద్ద పీట వేశారు. నిన్న ప్రకటించినటువంటి 126 మంది జాబితాలో కమ్మ కులస్తులకు 32 సీట్లను కేటాయించడం విశేషం. ఆ తరువాత బీసీ కులానికి ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. బీసీ కులానికి 31 సీట్లు కేటాయించగా, రెడ్డి కులస్తులకు 20 సీట్లు, అంతేకాకుండా బలిజ – తూర్పు కాపు అభ్యర్థులను 17 స్థానాలు అప్పగించారు. ఈ జాబితా వళ్ళ నిరాశ పడ్డటువంటి బ్రాహ్మణా కులానికి చెందిన నాయకులు తదుపరి విడుదల చేసే జాబితాలోనైనా తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ని కోరుతున్నారు.