టీడీపీ త‌మ్ముళ్ళు ఆ ఒక్క‌టే అడ‌డొద్దు.. ఇదే ఫైన‌ల్ అంటున్న‌ చంద్ర‌బాబు

Thursday, November 8th, 2018, 06:00:16 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై దృష్టి పెట్టారు. మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా మ‌హాకూట‌మి సీట్ల లొల్లి మాత్రం ఇంకా తేల‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణ‌లో చంద్ర‌బాబుతో టీటీడీపీ నేత‌లు స‌మావేశం అయ్యారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో ఈ గురువారం చంద్ర‌బాబును నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారని స‌మాచారం.

ఇక ఇప్ప‌టికే మహాకూట‌మిలో భాగమైన‌.. టీటీడీపీ నేత‌లు 17 సీట్లు వ‌ర‌కు కోరుతుండ‌గా కాంగ్రెస్ 14 సీట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. దీంతో తాజా స‌మావేశంలో చంద్ర‌బాబు వ‌ద్ద ఈ టీటీడీపీ నేత‌లు ప్ర‌స్తావించ‌గా.. ఆయ‌న‌ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశార‌ని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఫైన‌ల్ జాబితా వ‌స్తుంద‌ని.. అభ్య‌ర్ధుల పేర్ల పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, మ‌హాకూట‌మిలో 14 కంటే ఎక్కువ సీట్లు కోరితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. దీంతో టీఆర్ఎస్ ఓట‌మే మ‌న ల‌క్ష్య‌మ‌ని చంద్ర‌బాబ స్ప‌ష్టం చేశార‌ని టాక్. దీంతో ఎవ‌రైనా అసంతృప్తులు ఉంటే తాను మాట్లాడ‌తాన‌ని సీట్లు విష‌యం మాత్రం అడ‌గొద్ద‌ని ఇదే ఫైన‌ల్ అంటూ చంద్ర‌బాబు స‌మావేశాన్ని ముగించార‌ని స‌మాచారం. దీంతో తెలుగు త‌మ్ముళ్ళు ఆ ఒక్క‌టే అడ‌గొద్దు.. ఇదే ఫైన‌ల్ అంటున్న చంద్ర‌బాబు.. ఇది చంద్ర‌బాబు మార్క్ రాజ‌కీయం.. అంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.