గుంటూరులో జ‌గ‌న్ బ్లాస్టింగ్.. చంద్ర‌బాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..?

Friday, November 16th, 2018, 03:12:28 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. అధికార టీడీపీని ఎలాగైనా ఓడించాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటుంది. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్ని చేట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌డ‌ప‌తో మొద‌లైన ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం చేరుకుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో రాష్ట్రంలో వైసీపీకి మైలేజ్ బాగా రావ‌డంతో ప‌లువురు నేత‌లు వైసీపీలో చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా రాష్ట్రంలోని మ‌రో ముఖ్య‌నేత వైసీపీ చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఇంత‌కీ ఇద్ద‌రు ఎవ‌రంటే.. గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన‌ రావెల కిషోర్ బాబు టీడీపీని వీడ‌నున్నార‌ని గుంటూరు రాజ‌కీయ వ‌ర్గాల నండి ఒక టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు. అయితే కొన్ని అనివార్య కార్యాల వ‌ల్ల మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. దీంతో అప్ప‌టి నుండి చంద్ర‌బాబు పై అసంతృప్తిగా ఉన్న రావెల అప్ప‌ట్లోనే పార్టీ మార‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వైసీపీ నుండి స‌రైన రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో రావెల అసంతృప్తిగానే టీడీపీలో కొన‌సాగుతున్నారు.

అయితే తాజాగా మ‌రోసారి రావెల వైసీపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీలో రావెల ప‌రిస్తితి చాలా దారుణంగా ఉంద‌ని, ఎస్సీ సామాజిక వ‌ర్గ నేత కావ‌డంతో చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లందరూ రావెల‌ను టార్గెట్ చేస్తూ.. ఆయ‌న నియోజ‌క వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు అడ్డం ప‌డుతున్నార‌ట‌. దీంతో టీడీపీ నేత‌ల వ్యవ‌హారంతో తీవ్రంగా క‌ల‌త చెందిన రావెల అన అనుచ‌రుల‌తో స‌మావేశం అయ్యార‌ని.. ఈ క్ర‌మంలో వైసీపీలోని ఒక ముఖ్య‌నేత‌తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని.. ఆ ముఖ్య నేత వెంట‌నే జ‌గ‌న్‌తో కూడా చ‌ర్చించగా, ఆయ‌న కొన్ని ష‌ర‌తుల‌తో, గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. దీంతో వైసీపీలో రావెల ఎంట్రీ ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి రావెల వైసీపీలోకి వెళితే గుంటూరులో టీడీపీకి పెద్ద షాకే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.