జ‌గ‌న్ సీయం అయినా.. జైలుకు వెళ్ళ‌క త‌ప్ప‌దు..!

Friday, January 11th, 2019, 04:45:15 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చేసిన తాజా వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. జ‌గ‌న్ చేసిన విచ్ఛ‌ల‌విడి అవినీతే వ‌ల్లే ఆయ‌న మెడ‌కు కేసులు చుట్టుకున్నాయ‌ని, దీంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయినా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ, ప‌లు కేసుల‌తో కోర్టు తిరుగుత‌న్న వ్య‌క్తి, ముఖ్య‌మంత్రి కావాల‌ని అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని, చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు, తాజాగా నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో జ‌న్మ‌భూమి, మాఊరు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు, జ‌గ‌న్ వ‌ల్ల అనేకమంది జీవితాలు బ‌ల‌య్యాయ‌ని, ఎంద‌రో వ్యాపార‌వేత్త‌లు, ప్ర‌భుత్వ అధికారులు రోడ్డున ప‌డ్డార‌ని, దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. తాము కూడా జైలుకు వెళ‌తామ‌న్న భ‌యంతో, ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు పెట్టుబ‌డులు పెట్ట‌కుండా వెన‌క్కి వెళిపోతున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇక రాష్ట్ర ప్ర‌జ‌లు ఒక‌సారి ఆలోచించుకోవాల‌ని, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే సామాన్య ప్ర‌జ‌లు బిక్కు బిక్కుమంటూ గ‌డపాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు తేల్చేశారు.