కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన బాబు..!

Friday, November 9th, 2018, 10:21:48 AM IST

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే పై ఎత్తుల రాజకీయ నాయకుడు అని అందరికి తెలిసిందే, అయన ఎపుడు ఎం చేస్తాడో, ఎక్కడ ఎలా మాటాడతాడో ఎవరు అంచనా వేయలేరు. ఎందుకు ఎవరితో జత కడతారో, ఎందుకు ఎవరిని దూరం పెడతాడో, ఎవరికీ అర్థం కానీ నిగూఢ అర్థాలు ఉంటాయి. ఇక జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసేందుకు కుమార స్వామి, దేవెగౌడ తో భేటీ అయ్యేందుకు కర్ణాటక వెళ్లారు, ఆ భేటీ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి. వారం కిందట ఢిల్లీ వెళ్లి రాహుల్ తో కలిసి చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కుమారస్వామి, దేవెగౌడ తో భేటీ తర్వాత చేసిన వ్యాఖ్యలకు ఏ మాత్రం పొంతన లేదు.

2019 ఎన్నికల్లో బీజేపీ ని గద్దె దించుతాం అని చెప్తున్న బాబు ఇపుడు ఆ స్తానంలో మూడవ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను బేజారెత్తిస్తున్నాయి. 1996 లో కూడా సరిగ్గా ఇలాగె జాతీయ స్థాయిలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కూటమి అధికారం చేపట్టిన సంఘటన గుర్తు చేస్తున్నాడు. ఇపుడు కూడా అదే జరగబోతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బాబు ప్రకారం కాంగ్రెస్ మద్దతుతో మరోసారి మూడవ కూటమి అధికారంలోకి రాబోతుందట .ఇన్నాళ్లు కాంగ్రెస్ నాయకులూ రాహుల్ కాబోయే ప్రధాని అంటూ పెట్టుకున్న ఆశలు చంద్రబాబు వల్ల ఉత్తుత్తి మాటగా మిగిలే అవకాశం ఉందన్నమాట.