చంద్రబాబు ప్రధాని కావాలి : జేసి దివాకర్ రెడ్డి

Tuesday, May 29th, 2018, 03:52:19 PM IST

ప్రస్తుతం టిడిపి పార్టీ చేపట్టిన మహానాడు మంచి జోరుతో నడుస్తోంది. రోజు రోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని, ఈ మూడురోజుల్లో ఇవాళే ఆఖరిరోజు కావడంతో ప్రజలు మరింత ఎక్కువమంది వచ్చారని తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నాడు. ముఖ్యంగా మహానాడులో తీర్మానాలు ప్రజల సంక్షేమమే ద్యేయంగా ప్రవేశపెట్టామని, కేంద్రం రాష్ట్రానికి నిధుల విషయంలో, అలానే హోదా విషయంలో చేసిన అన్యాయం పై నేతలు ఒక్కొక్కరు మండిపడ్డారు. అయితే ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచే అనంతపూర్ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి నేడు మహానాడు వేదికగా కొన్ని సంచలన వ్యాఖ్యలుచేసారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరిపట్లా చూసీచూడనట్లు జాలితో వ్యవహరిస్తారని, విభజన హామీలు, ప్రత్యేక హోదావిషయంలో వారు మనకు న్యాయం చేస్తారని ఆయన బిజెపిని ఎంతో నమ్మారని అన్నారు.

అయితే ఆ నమ్మకాన్ని బిజెపి వొమ్ము చేసిందని, తరువాత ప్రత్యేక ప్యాకెజీ ఇస్తామని ఆశచూపి మరింత ద్రోహం చేసారని మండిపడ్డారు. తాను మొదట్లోనే బిజెపిని నమ్మొద్దని, వారితో మిత్రత్వం సరైనది కాదని అన్నానన్నారు. పోలవరం విషయంలో అవినీతి, కుట్రలు జరిగాయంటే అది కేవలం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, చంద్రబాబు ఆ పరాజక్టు పూర్తికి తనవంతు కృషి చేస్తున్నారని అన్నారు. ఎంతో సౌమ్యుడు అయిన చంద్రబాబు ప్రధాని హోదాకు అన్నివిధాలా సరిపోయే వ్యక్తి అని, ఎన్నోసార్లు ఆయనకు ఆ అవకాశం కూడా వచ్చినప్పటికీ దానిని ఎందుకు జారవిడుచుకున్నారో తనకు అర్ధం కాలేదని చెప్పారు. బిజెపి నియంతృత్వ పోకడలు, ముఖ్యంగా మోడీ వంటి నియంతలు దేశాన్ని పాలించినంతకాలం మనకు హోదా అందని ద్రాక్షేనని, మనల్ని మోసం చేసిన బిజెపికి ఏపీలో డిపాజిట్లు కూడా దక్కవని ఆయన మండిపడ్డారు…..

  •  
  •  
  •  
  •  

Comments