పోలవరమే బాబుకు వరం.. అమరావతి భ్రమరావతే..!

Thursday, September 22nd, 2016, 11:32:12 AM IST

babu-polavaram
పదేళ్ల ప్రతిపక్షంలో ఎన్నో ఒడిదుడుకులతో పార్టీని నడిపించి చివరకు 2014 లో పార్టీని అధికారంలో నిలబెట్టారు.గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనేక అంశాలు కలిసొచ్చాయి.విభజనతో ఏర్పడ్డ పరిస్థితులని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకోవడంలో 100 శాతం విజయంసాధించారు.దానికి తోడి పవన్, మోడీలు బాబుతో కలసి రావడంతో ఎపి లో టిడిపి విజయం ఇంకాస్త సులభంగా మారింది. విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో బాబు కు బాగా కలిసొచ్చిన అంశం రాజధాని.విభజన తరువాత ఏపీ ప్రజలు తమకు మంచి రాజధానిని నిర్మించే నాయకుడిని కోరుకున్నారు. ఈ దశలో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని.. మరో సింగపూర్ లాంటి రాజధాని.. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానంటూ ప్రజల్లోకి వెళ్లారు.ఈ హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఇంకేముంది ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది.

కానీ ప్రస్తుతం ఏపీ ఆర్ధిక పరిస్థితి, కేంద్రం అందించే సహకారం చూస్తుంటే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేంత సీన్ లేదనేది విశ్లేషకుల వాదన.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సగటు పౌరుడికి తెలిసిన విషయమే.అలాగని చంద్రబాబు చూస్తూ కూర్చుంటే ప్రజలు 2019 లో ఊరుకోరు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు విజయం సాధించి చూపించాలి. రాజధాని ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఇక చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పైనే ద్రుష్టి సారించాలని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షమైన వైసిపి చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి అమలు చేయని వాటినే ఆయుధాలుగా మలుచుకునేందుకు చూస్తోంది.చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కూడా ప్రతి చేయక పొతే టిడిపికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజధాని అమరావతి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నిజమే అని అనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి పెద్ద భ్రమరావతి అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజ్ చుస్తే అది నిజమనిపించక మానదు.