చంద్రబాబు స్పెషల్ ట్వీట్స్!

Sunday, September 2nd, 2018, 05:10:12 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పరంగా ప్రత్యర్థులపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఏదైనా విశేషం ఉంటే మాత్రం వెంటనే తనదైన శైలిలో విషెష్ అందిస్తారు. గతంలో జగన్ పుట్టినరోజు సందర్బంగా అసంబ్లీలో జగన్ వద్దకు వెళ్లిమరీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం జనసేనపై రాజకీయంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు.

ఇక నేడు దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కావున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ పొలిటికల్ కెరీర్ అలాగే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఒకేసారి మొదలైంది. ఇద్దరు కాంగ్రెస్ లో కీలకనేతలుగా ఎదిగారు. ఇక చంద్రబాబు టీడీపీలోకి వచ్చిన తరువాత కూడా వ్యక్తిగతంగా తమ ఇద్దరికి మంచి స్నేహ బంధం ఉండేదని చంద్రబాబు చెబుతారు. అదే విధంగా హరికృష్ణ జయంతి కూడా నేడే కావడంతో ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా అని పేర్కొన్నారు. “చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేడు తన జయంతి సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. టిడిపి కార్యకర్తల్లో హరి నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments