సేవ్ నేషన్.. బీజేపీని కూల్చడమే ప్రధాన లక్ష్యం !

Thursday, November 1st, 2018, 10:14:53 AM IST

ప్రత్యర్థిని అదును చూసి దెబ్బ కొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయన ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ వేశాడంటే వర్కవుట్ అవ్వాల్సిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రధాన ప్రత్యర్థిగా భావించిన బాబు బీజేపీ, పవన్ కళ్యాణ్ లతో కలిసి ఆ పార్టీని రాష్ట్రంలోనే లేకుండా చేశారు. ఇప్పుడు అదే పార్టీతో కలిసి ప్రస్తుతం తనకు, రాష్ట్రానికి శత్రువుగా పరిణమించిన మోడీ సర్కారును కూకటి వేళ్ళతో సహా పెకలించాలని పథకం రచిస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించి మొన్నీ మధ్యనే బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని సూచించిన ఆయన ఈరోజు ఢిల్లీ పయనమయ్యారు. కీలకమైన ఈ టూర్లో ప్రత్యున్మాయ కూటమికి పూర్తి స్కెచ్ రెడీ అవుతుందని టాక్.

సేవ్ నేషన్ నినాదంతో ఈ టూర్ చేస్తున్న బాబు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలకు ఏకతాటిపైకి తేవాలని అనుకుంటున్నారు. ముందుగా శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్ వంటి నేతల్ని కలిసి అనంతరం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో త్వరలో రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాను చిత్తుగా ఓడించి దెబ్బతీయడానికి అమలుచేయాల్సిన అంశాల్ని చర్చించనున్నారు.

దేశంలోని అత్యున్నత వ్యవస్థలు సీబీఐపై, ఆర్బీఐలను నిర్వీర్యం చేయడం, టీడీపీపై, ఏపీపై కక్ష సాధింపుకు దిగడం వంటి మోడీ తప్పిదాలను, తనకు 1995లోనే ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చిందని, కానీ రాష్ట్రం కోసం వదులుకున్నాననే అంశాన్ని హైలెట్ చేసి ఈ వ్యవహారం మొత్తాన్ని నడపాలనేది బాబుగారి ఆలోచన. ఒకవేళ బాబు అనుకున్న ప్లాన్ గనుక వర్కవుట్ అయితే కేంద్ర రాజకీయాల్లో ఆయన కీలకంగా మారే ఛాన్సుంది.

  •  
  •  
  •  
  •  

Comments