చంద్రబాబు హెచ్చరికలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి : పవన్ కళ్యాణ్

Thursday, May 17th, 2018, 03:44:57 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఒక ప్రకటన విడుదల చేసారు. ఇటీవల దాచేపల్లిలో చిన్న బిడ్డ పై ఒక వృద్ధుడు చేసిన పైశాచిక పని మరువక ముందే మరొక బిడ్డపై గుంటూరు నగరంలో దాడి జరగడం తన గుండెను కలిచి వేసిందన్నారు. ఆడపిల్లలపై ఇంత హేయంగా దారుణంగా దాడులు జరగడం అమానుషమని, కొందరు మృగాళ్లు అభం శుభం తెలియని పసిపిల్లపై దాడి చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడపిల్లపై అఘాయితలకు తెగబడితే ఊరుకునేది లేదని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, ఇటువంటి దాడులు చేసిన వారికి శిక్షలు విధించే ఫోక్సో చట్టము ఉన్నప్పటికీ ఇవి ఆగడం లేదంటే ఆ చట్టాన్ని మరింత కఠినతరంగా అమలు చేయాలని ఆయన అన్నారు.

మహిళల, చిన్నపిల్లల రక్షణ మన ప్రధమ కర్తవ్యమని, ప్రభుత్వం వారి రక్షణ పట్ల మరింత శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేసారు. దానితోపాటు అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా అవసరమైతే కొన్ని సవరణలు చేసి, ఎవరైనా ఆడపిల్లల, లేదా మహిళల జోలికి వెళితే వారికి బహిరంగ శిక్షలు వేసేలా విధానాల రూపకల్పన జరగాలన్నారు. అంతే కాదు ప్రతిఒక్కరికి మహిళా రక్షణ పట్ల అవగాహన కల్పించాలని, ఎక్కడైనా ఏ అమ్మాయి మీదనైనా దాడి జరిగితే వెంటనే స్పందించి ఆ మహిళలకు తమవంతు సాయమందించేలా యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి మహిళ, ఆడపిల్లల రక్షణకు త్వరితగతిన రక్షణ చర్యలు ప్రారంభించాలని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments